TRINETHRAM NEWS

తేదీ:14/01/2025.
నూతిపాడు లో గందరగోళం
తిరువూరు:( త్రినేత్రం న్యూస్): విలేఖరి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేట మండలం, నూతిపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా కోడి పందేలుపేకాట, గుండాట జోరుగా సాగుతున్నాయి ఈ సందర్భంలో ఇరువర్గాలు కొట్లాట నెలకొంది.
ఎవరికి ఏమి జరిగిందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సుప్రీం కోర్టు పరిమిషన్ ఇవ్వకపోయినా బడా నాయకులు మరియు పందెం రాయుళ్లు జోరుగా కొనసాగిస్తున్నారు. వీటిని పట్టించుకునే నాధుడే లేడా?
సంక్రాంతి అంటే క్రీడలు మరియు ఆటపాటలు అని ప్రభుత్వం చెప్పినా వీటిని పక్కన పెట్టారు. దయచేసి కోడి పందాలు, జూదం, గుండాట వంటివి నాయకులు వ్యతిరేకించాలని ప్రజలు కోరుకోవడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App