Traffic Constable : మానవత్వం చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కు బాధ్యత అభినందన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : కాకిబట్టలు మాటున కఠినత్వమే కాదు చిన్నారులకు చెప్పులు కొనిపెట్టి మానవత్వం చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెలిశెట్టి వెంకటరత్నంకి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం బాధ్యతా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గిరజాల బాబు అభినందన సత్కారం చేశారు. ఇటీవల విజయవాడ పోరంకి సమీపంలో నడిరోడ్డు మీద కాళ్లకు చెప్పుల్లేకుండా వెళుతున్న పిల్లలను చూసి చెల్లించిపోయి వాళ్లకి వెంటనే చెప్పులు కొనిపెట్టి తన ఉదారతను చాటుకున్నారు. ఆయన చేసిన సేవ రాష్ట్రమంతటా వైరల్ అయింది. బాబు నేతృత్వంలో బాధ్యతా సభ్యులు బుధవారం విజయవాడ కామయ్యతోపు జంక్షన్లో ట్రాఫిక్ నిర్వహణా విధుల్లో ఉన్న ఆయన్ని కలిసి అభినందించారు.

పూల మొక్కలు, మెమెంటో బహుకరించి, ఆయన సేవలు ప్రశంసిస్తూ అభినందించారు. ఈ సందర్భంగా గిరజాల మాట్లాడుతూ ఇటువంటి నిజమైన సేవా తత్పరులను అభినందించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వీరి సేవలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బాధ్యత సేవా సంస్థ సేవలు చేయడమే కాకుండా, ఇటువంటి వారిని గుర్తించి వారిని సముచిత రీతిలో గౌరవించడం కూడా చేస్తోందన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు,బాధ్యత సభ్యులు మహమ్మద్ సర్కార్ భాషా, పున్నమ రాజు వీర్రాజు, కొక్కిరాల వెంకటేశ్వరరావు, రాగోలు మహేష్ తదితరులు సత్కార కార్యక్రమంలో ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

traffic constable who showed humanity

You cannot copy content of this page

Scroll to Top