సెప్టెంబర్ 15, 2026
TRINETHRAM NEWS
Collector Surprise Inspection

ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన!

Collector Surprise Inspection : రాజన్న జిల్లా:ఆగస్టు 24 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో ప్రతి సోమ వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్ర మంలో భాగంగా… రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవా ల్, సోమవారం ప్రజా వాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వ హించిన ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ శాఖ ల మండల స్థాయి అధికారుల హాజరు ను పరిశీలించారు.

గత వారం ప్రజావాణి కి వచ్చిన దరఖాస్తుల వివరాలను అధికారు లను అడిగి తెలుసు కున్నారు.అలాగే నూతన పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తు లను పరిశీలించారు. పెన్షన్ కోసం అవసరమైన వివిధ ధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందిం చాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదే శాల మేరకు జిల్లా సమీకృత కార్యాల యాల సముదాయం తో పాటు రెవెన్యూ డివిజన్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగు తుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వ హించే ప్రజావాణిని సద్వినియోగం చేసు కుని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page