Cold Storage Facility : ఎల్లమ్మ బండలో చలివేంద్రం ప్రారంభం – ప్రజాసేవలో ముందున్న డా. నరేష్ కొరదల

TRINETHRAM NEWS
Cold storage facility inaugurated in Yellamma Banda

Cold Storage Facility : కూకట్పల్లి మార్చి 29 (త్రినేత్రం న్యూస్) : మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎల్లమ్మ బండలో చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాన్ని డా. నరేష్ కొరదల స్వయంగా ప్రారంభించారు.
డా. నరేష్ కొరదల అభిమానులు, “నరేష్ అన్న యువ సైన్యం” సభ్యులు కలిసి ప్రజల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రతలో తాగునీటి అవసరం పెరుగుతున్న సమయంలో ఈ కార్యక్రమం స్థానికులకు ఉపశమనం కలిగిస్తోంది.
ఈ సందర్భంగా డా. నరేష్ కొరదల మాట్లాడుతూ, “ప్రజలకు సేవ చేయడం మన బాధ్యత మాత్రమే కాదు, మన కర్తవ్యము కూడా. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.
స్థానికులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, మండుటెండల్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top