TRINETHRAM NEWS

నగరి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ పథకం వేతనాలు పెంచకుండా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆమలు పరచాలని కూటమి ప్రభుత్వం అమలు చేయాలి.అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు హామీలు ఇస్తానని చెప్పి బహిరంగ సభలో గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అంగన్వాడీలకు లక్ష ఇరవై వేల రూపాయలు ,70000 ఆయాలకు ఇస్తామని అదేవిధంగా మినీ అంగన్వాడీ మేన్ అంగన్వాడీలు చేస్తామని 60 సంవత్సరాల వయసు 62 కు పెంచుతున్నట్టు గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా చర్చల్లో ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు ఎక్కడికక్కడ సమ్మె శిబిరాలకు వచ్చి మేము అధికారానికి వస్తే మీకు వేతనాలు పెంచి మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వాస్తవమా కాదా.

అందులో భాగంగా ఎన్నికల్లో నూటికి 95 మంది కార్మికుల ఉద్యోగస్తులు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అధికారం వచ్చి 9 నెలలు అవుతున్న ఇచ్చిన హామీలను అమలుపరచకపోగా గత ప్రభుత్వంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను కూడా అంగన్వాడీలకు లచ్చ ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు తగ్గించడం ఆయాలకు 70 వేల నుంచి 40 వేలకు తగ్గించడం ఇది మీకు తగునా అని ప్రశ్నిస్తున్నాం. అందువల్లన ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కచ్చ సాధింపులకు పోకుండా మహిళా కార్మికుల న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మీరు ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించి పని భద్రత తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. .ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మండల కార్యదర్శి శ్యామల నాయకురాలు సుజాత చందా మరి సలీనా ఉషారాణి వెంకటమ్మ నగోమి వసంత కుట్టి పార్వతమ్మ లక్ష్మి రూప షిభా, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య నాయకులు వేలన్ మురళి నాగరాజు సతీష్ శేఖర్ రాజేంద్ర చినరాజు రమేషు మహిళా కార్మికులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

women workers on Women's Day