ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
CM Revanth

త్రినేత్రం న్యూస్ : CM Revanth : Jul 18, 2026, స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన స్కైరూట్ ఏరోస్పేస్ ‘విక్రమ్-1‘ ఆర్బిటల్ క్లాస్ ప్రయోగ వాహనం విజయవంతమైన టెస్ట్ ఫ్లైట్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘మిషన్ ఆగమన్’ విజయం భారత అంతరిక్ష రంగ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ సంస్థ సాధించిన ఈ విజయం రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల ప్రతిభకు ఇది నిదర్శనమని సీఎం ప్రశంసించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page