WhatsApp Image 2024 01 06 at 9.17.06 AM
Trinethram News :
మూడో లిస్ట్ పై సీఎం జగన్ కసరత్తు…
రెండు, మూడు రోజుల్లో 15 మందితో మూడో జాబితా…
సీఎం జగన్ మూడో జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎంవో కార్యాలయానికి నేతలు క్యూకడుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో 15 మందితో ఈ జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది..
సీఎం కార్యాలయానికి ఈరోజు మైలవరం ఎమ్మెల్యే వసంత, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున రెడ్డి , దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వచ్చారు.
ఈ జాబితాలో కూడా 10-15మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు, పేర్లు తారుమారు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పలువురు అసంతృప్తులను అధిష్టానం బుజ్జగిస్తోంది. వారికి ఏదో విధంగా పదవులు కట్టబెడతామని హామీతో కూల్ చేస్తోంది.
రెండోసారి అధికారంలో రావాలని జగన్ ఇస్తున్న ధైర్యంతో నియోజకవర్గాలు మార్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుుడు పోటీకి సై అనడం అధిష్టానాన్ని కలవరపెడుతుంది…
