WhatsApp Image 2024 01 06 at 9.25.27 AM
Trinethram News : 6th Jan 2024
విశాఖపట్నంలో అలజడి.. ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం…
సముద్రం ఉన్నట్టుండి.. 100 అడుగులు వెనక్కి వెళ్లడం ఇప్పుడు విశాఖపట్నం వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
జపాన్‌లో భారీ భూకంపం ప్రభావమో, లేక రెగ్యులర్ అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల ప్రభావమో.. తెలియదు గానీ, విశాఖలో మూడు, నాలుగు రోజులు నుంచి సముద్రం కాస్త వెనకకు వెళ్ళింది.
దీంతో సముద్రంలో అలజడి రేగింది. ఎక్కడో జపాన్‌లో భూకంపం వస్తే అంత దూరం వెళ్తుందా? అసలు కారణం అదేనా? వేరే ఏమైనా కారణాలా? అన్న అనుమానాలు తలెత్తున్నాయి.
