CM Chandrababu’s visit to the flooded areas of Uttarandhra.. Aerial view of Kolleru
Trinethram News : Andhra Pradesh : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించనున్నారు. కొల్లేరు, ఉప్పటేరులలో వరద ఉధృతిని, ముంపు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించనున్నారు.
కొల్లేరు ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. బుడమేరు పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నీరంతా దిగువున ఉన్న కొల్లేరుకు చేరింది. కొల్లేటి సరస్సులో నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు ఉండగా.. దీనికి మించి వరద కొల్లేరులోకి చేరడం, పెద్ద సంఖ్యలో లంక గ్రామాలు ముంపులో చిక్కుకుని ప్రజలు భారీ నష్టాన్ని చవిచూశారు. చేపల చెరువులు ముంపునకు గురయ్యాయి. ఆయా గ్రామాలకు ప్రజలు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో కైకలూరు పరిధిలో నష్టపోయిన కొల్లేరు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు.
- ఉదయం 10గంటలకు విజయవాడ నుంచి హెలికాప్టర్ లో సీఎం చంద్రబాబు బయలుదేరుతారు.
- 10.50 గంటలకు ఏలూరు జిల్లా కైకలూరు, కొల్లేరు ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తారు.
- 11.30 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో కొల్లేరు ప్రాంతంలోని ఉప్పుటేరు వంతెన వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడతారు.
- మధ్యాహ్నం 1.05 గంటలకు కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
- 1.45 గంటల వరకు విరామం తీసుకొని రోడ్డు మార్గంలో కిర్లంపూడి మండలంలోని ముంపు ప్రాంతమైన రాజుపాలెం వెళ్తారు.
- మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 2.45 గంటల వరకు అక్కడ పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకుంటారు.
- సామర్లకోటలోని టీటీడీసీకి చేరుకొని వరద ప్రాంతాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను చంద్రబాబు నాయుడు తిలకిస్తారు.
- వరద తాజా పరిస్థితి, సహాయక చర్యలపై కీలక శాఖల అధికారులతో సమీక్షిస్తారు.
- సాయంత్రం 4.15 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి వెలంపూడి చేరుకుంటారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App