TRINETHRAM NEWS

Trinethram News : (తిరుపతి జిల్లా): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం గురువారం రాత్రి తిరుమల చేరుకున్నారు.

ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ కూడా ఉన్నారు. పద్మావతి విశ్రాంతి గృహం దగ్గర టీటీ డీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి రామానారాయణ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామల రావు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

రాత్రి అక్కడే బస చేసిన సీఎం కుటుంబం, శుక్రవారం ఉదయం స్వామివారి దర్శనానికి వెళ్లనుంది. నేటి ఉదయం 7:45 గంటలకు పద్మావతి విశ్రాంతి గృహం నుంచి బయలుదేరి వైకుం ఠం-1 క్యూ కాంప్లెక్స్‌కు చేరుకుంటారు.

ఉదయం 8 నుంచి 8:50 గంటల వరకు శ్రీవారి ఆలయంలో దర్శనం చేసుకుంటారు. ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ, మహాద్వారం ద్వారా కాకుండా క్యూ కాంప్లెక్స్ నుంచే ప్రవేశిస్తారు. దర్శనం తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకుంటారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu Naidu in