TRINETHRAM NEWS

కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి తీపి కబురు అందించాలని సీఐటీయు

తుమ్మల.రాజారెడ్డి
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలోని అర్జీ1, ఏరియా వర్క్ షాప్ లో నంది నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ రేపు పెద్దపల్లికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల మేరకు దీర్ఘకాలికంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలైన సొంత ఇంటి కల, అలవెన్స్లపై ఐటి మాఫీ వంటి సమస్యలతో పాటు ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న మారుపేర్లతో పని చేస్తున్న కార్మికుల సమస్యను పరిష్కరించాలని, మరియు కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు జీవో ను అమలు చేసే విధంగా యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియుగా కోరుతున్నామన్నారు. కార్మికుడు 30 సంవత్సరాలు సింగరేణిలో రక్తం దారపోసి సేవ చేసినా రిటైర్డ్ అనంతరం ఉండడానికి సొంత ఇల్లు అనేది లేకుండా పోతున్నదని కార్మికులు నివసిస్తున్న ఎవరి కోటరు వారికే ఇచ్చి సొంతింటి పథకాన్ని అమలు చేయాలని క్వార్టర్ లేని కార్మికులకు సింగరేణిలో కబ్జాలకు గురవుతున్న స్థలాలలో 250 గజాలు కేటాయించడం వలన కార్మికుని కోరిక నెరవేరుతున్నదని దీనివలన పెర్క్స్ పై ఐటి మాఫీ భారం సంస్థకు, ప్రభుత్వానికి ఎలాంటి భారం పడదని అన్నారు. గతంలోనే సిఐటియుగా సంతకాల సేకరణ చేయడం సి. అండ్ ఎండి. డైరక్టర్లకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం వంటివి చేశామని అప్పటికే సానుకూలంగా స్పందించడం జరిగిందని ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్దపల్లికి వస్తున్న సందర్భంగా ఆయన దృష్టికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మరియు లోకల్ ప్రజాప్రతినిధులందరూ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలియజేసి కార్మికులకు తీపి కబురును అందించాలని విజ్ఞప్తి చేయాలన్నారు. సొంతింటి కల నెరవేర్చడం వలన కోల్బెల్టు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని దాని వలన ప్రభుత్వానికి సైతం ఆదాయం పెరిగే అవకాశం ఉన్నదని తెలియజేశారు. కాంట్రాక్టు కార్మికుల సైతం ఎన్నో ఏళ్లుగా శ్రమ దోపిడీకి గురౌతూ వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్నారని, ఇలాంటి అంశాలపై గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ ప్రభుత్వం అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీలు ఈ సమస్యపై ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయాలని త్వరలో పలు యాజమాన్యం ఆధ్వర్యంలో అమలుచేసే పెండింగ్ అంశాలపై సిఐటియు ఆధ్వర్యంలో చేసే ఆందోళనకు అన్ని యూనియన్లతో పాటు కార్మికులు సైతం కలిసి వచ్చి దీర్ఘకాలిక సమస్యలను సాధించుకోవాలని ఆయన కార్మికులను కోరారు.
ఈ కార్యక్రమంలో అర్జీ1, బ్రాంచి అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌలి, రాష్ట్ర నాయకులు తోట నరహరి రావు, కారం సత్తయ్య, పిట్ కార్యదర్శి నంది నారాయణ, బాగే రవి, బొద్దుల ఓదెలు, సంతోష్, వంగల శివరామరెడ్డి, ఈ సాగర్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App