ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 02 10 at 10.06.28

TRINETHRAM NEWS

సినీ హీరో మహేశ్‌బాబు కుమార్తె… సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు.. క్లిక్ చేస్తే అయిపోయినట్టే

సైబర్ మోసాలకు తెగబడుతున్న నేరగాళ్లు

ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలు

ఇలాంటి వాటిని నమ్మొద్దన్న జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ

సైబర్ నేరగాళ్లు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు తనయ సితార పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె పేరుపై ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి ఇన్వెస్ట్ మెంట్, ట్రేడింగ్ లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా ఆ లింకులపై క్లిక్ చేస్తే వారి ఖాతాలు గుల్లయినట్టే.

ఈ లింకులను గుర్తించిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి లింకులను నమ్మవద్దని, సెలబ్రిటీల పేరుతో వచ్చే ఇలాంటి లింకులపై క్లిక్ చేసి కష్టాలపాలు కావొద్దని సూచించింది.

You cannot copy content of this page