TRINETHRAM NEWS

సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి: సి.ఐ

Trinethram News : ప్రకాశం జిల్లా కంభం..సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సీఐ మల్లికార్జున రావు అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలలో నూతన పోకడలు,గంజాయి, డ్రగ్స్ దుర్వినియోగం, మహిళలు,బాలికలపై అఘాయిత్యాలు, బాల్య వివాహాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు.విద్యార్థి దశలో ఆకర్షణలకు లోనుకాకుండా చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలనీ,గంజాయి, డ్రగ్స్ తదితర దురలవాట్లకు బానిసలు కావద్దన్నారు, ఎస్ఐ నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమయస్ఫూర్తితో సక్సెస్ సాధించాలన్నారు, పురాణాలలోని కొన్ని కథలను ఉదహరిస్తూ విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. బాల్య వివాహాలు బాలికల భవితకు గొడ్డలిపెట్టులాంటివని, అవి బాలికల ఆరోగ్యంతో బాటు వారి ఆశలను,ఆశయాలను హరిస్తాయని, బాల్య వివాహాల దుస్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. చిన్నారులకు బ్రతుకు పాఠాలను వివరిస్తూ పుస్తక పఠనంతో జీవిత పాఠాలను సమన్వయం చేసుకుని సాగిపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో, ప్రధానోపాధ్యాయుడు బి.మాల్యాద్రి,సీఆర్పి, ఉపాధ్యాయులు పోలీసు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App