TRINETHRAM NEWS

పాపులను సైతం క్షమించిన క్రీస్తు మానవాళికి ఆదర్శం : కేసీఆర్..!!

Trinethram News : హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాపులను సైతం క్షమించిన క్రీస్తు మానవాళికి ఆదర్శం అని ఆయన పేర్కొన్నారు.

విద్వేషాన్ని వీడి వివేకంతో జీవించాలనేదే క్రీస్తు బోధనా సారాంశం అని చెప్పారు. విశ్వశాంతిని కాంక్షించే పరోపకారులకు యేసు బోధనలు అనుసరణీయం అని పేర్కొన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ మైనార్టీలకు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు. సర్వమత సమానత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరించింది.. క్రిస్మస్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని కేసీఆర్ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App