TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 4 : కూకట్పల్లి నియోజక వర్గం ఫతేనగర్ నగర్ డివిజన్ లో నివాసం ఉంటున్న  జి.అరుణ వయస్సు 42 సంవత్సరాలు, చేతి గాయం అవడం వలన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వైద్యులు చేతికి బైపాస్ సర్జరీ చేయవలసిందిగా సూచించారు.వారి తనయుడు అయినటువంటి మౌనేందర్ గౌడ్ కూకట్పల్లి లోని కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ని సంప్రదించగా  ముఖ్యమంత్రి సహాయ నిది కి అప్లై చేయించగా వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా( ఎల్ ఓ సి) రూ1,00,000/ (లక్ష రూపాయలు) మంజూరు అయినవి.

ఆ ఎల్ ఓ సి లెటర్ ను కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ  ఇన్చార్జి బండి రమేష్ చేతుల మీదగా జి అరుణ తనయుడికి శుక్రవారం రోజున బాలనగర్ పార్టీ కార్యాలయంలో అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, తూము వేణు, పుష్ప రెడ్డి, లక్ష్మయ్య, దండగుల యాదగిరి, రాఘవేందర్, కుక్కల రమేష్,యుగేందర్ , మధు గౌడ్, మేకల రమేష్, మల్లికార్జున్ యాదవ్, మస్తాన్ రెడ్డి, అయాజ్ , ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మౌనేందర్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు  బండి రమేష్ కి  కృతజ్ఞతలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister's Relief Fund