Chief Minister Chandrababu will go to Delhi on July 4
బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చలు
Trinethram News : అమరావతి, జూన్ 30 ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 4వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపఽథ్యంలో రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్రంతో చర్చించే నిమిత్తం ఆయన వెళ్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నారు.
ఆర్థికంగా ఒడిదొడుకుల్లో ఉన్న రాష్ట్రానికి నిధులు సాధించుకునే లక్ష్యంతో ఆయన వెళ్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. విభజన హామీల అమలుపైనా చర్చిస్తారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వస్తే దాని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌కు ఒక రూపం ఇవ్వవచ్చన్న అభిప్రాయంలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఆయన మరో రోజు కూడా ఢిల్లీలో ఉండే అవకాశముంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App