Chhoppadandi MLA Dr. Medipalli_Satyam should be given an opportunity in the ministerial category
చొప్పదండి : త్రినేత్రం న్యూస్
చొప్పదండి రాజకీయాలలో తనదైన మార్క్ చూపిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంత్రివర్గంలో స్థానం కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మచ్చ రమేష్ కోరారు. మచ్చ రమేష్ మాట్లాడుతూ తనను నమ్ముకొని కష్టపడ్డ కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే సంకల్పంలో గతంలో తనని నమ్ముకొని పది సంవత్సరాలు వెంట నడిచిన వ్యక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ నామినేటెడ్ పదవులలో తనదైన ముద్ర వేశారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మన చొప్పదండి నియోజకవర్గనికి దొరకడం మన చొప్పదండి నియోజకవర్గ ప్రజల అదృష్టం అని మచ్చ రమేష్ అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేలు గా గెలిచిన వారిలో జగిత్యాల జిల్లాకు చెందిన ధర్మపురి ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ గా అవకాశం కల్పించారని..మొదటిసారి గెలిచిన సిరిసిల్ల జిల్లా కు చెందిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా అవకాశం కల్పించారని.
ఉమ్మడి కరీంనగర్ కి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మరియు దుద్ధిల్ల శ్రీధర్ బాబు మంత్రులు గా ఉన్నాకూడా ఒకరు పెద్దపల్లి జిల్లా మరియు మరోకరు సిద్ధిపేట జిల్లా అవడం తో కరీంనగర్ జిల్లా కు మంత్రి వర్గం లో చోటు లేకుండా పోయింది. కాబట్టి రాష్ట్రం లోనే కరీంనగర్ జిల్లాకు చొప్పదండి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత వుంది. కరీంనగర్ జిల్లాలో గెలిసింది ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే.. అందులో ఒకరు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు గా కొనసాగుతున్నారనీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి చొప్పదండి నియోజకవర్గానికి ఇప్పటికీ మంత్రి పదవి అవకాశం రాలేదని. కావున ఇప్పటికైనా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ఓయూ ఉద్యమకారుడు. విద్యావేత్త అయినటువంటి చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మంత్రి వర్గం లో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మచ్చ రమేష్ కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App