TRINETHRAM NEWS

• వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ

• చింతపల్లిలో ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం

Trinethram News : త్రినేత్రం న్యూస్ : పార్టీ రాష్ట్ర కార్య దర్శి అద్దంకి ముక్తేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, అన్ని మండలాల్లో వారానికోసారి ముఖ్య కార్యకర్తలతో ఆతీ ్మయ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నాలు గేళ్లూ అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నేడు డబ్బుల్లేవని సాకులు చెబుతూ, సంక్షేమ పథకా లను విస్మరించారని దుయ్యబట్టారు.

పెదపూడి: ఎన్నికల హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని, సూపర్ సిక్స్ అంటూ మోసపూరిత హామీలతో ప్రజలను దెబ్బ తీశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మం త్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఆయనతో పాటు, పార్టీ రాష్ట్ర యువ జన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజక వర్డ కో-ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

జక్కంపూడి గెలుపోటములు శాశ్వతం కాదని, ఎన్నికల్లో గెలిచి నప్పుడు మన ప్రవర్తన, చేసిన మంచి భవిష్యత్తును నిర్ణయిస్తుందని జక్కంపూడి రాజా అన్నారు. రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా అనపర్తి నియోజకవర్గం లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వీటిని ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.

డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలులో ఎన్డీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎత్తేశారని, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, వాటిని ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇసుక, మట్టి ఏది దొరికితే అది దోచుకోవటమే కూటమి నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పెంచిన ధరను ప్రభుత్వమే భరించాలి.
గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ హయాంలో కేంద్రం గ్యాస్ సిలిండర్ రూ.50 పెంచితే, ఆ భారం ప్రజలపై పడరాదన్న ఉద్దేశంతో రాయితీగా అందించారని, అలాగే ప్రస్తుతం పెరిగిన గ్యాస్ సిలిండర్ రూ.50ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సమావేశం తీర్మానించింది.

కార్యక్రమంలో అనపర్తి ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణా రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ గుత్తుల రమణ, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు కోసూరి వాసు, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు సాం బత్తుల చంటి, వైస్ ఎంపీపీలు ద్వారంపూడి పద్మారెడ్డి, కరెడ్ల వెంకన్నబాబు, మాజీ ఎంపీపీ కర్రి శ్రీవెంకటరెడ్డి, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొల్లు పెద్దకాపు, సర్పంచులు కొల్లు లోపకుమారి, సుం దరపల్లి ప్రమీల, మీనవల్లి శారదదేవి, ఎంపీటీసీ సభ్యులు సుందరపల్లి సుధాకర్, సమ్మంగి దుర్గాప్ర సాద్, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు మార్ని కామరాజుచౌ దరి. గుండా ఈశ్వరరావు, పార్టీ నాయకులు మంద పల్లి బుల్లిరాజు, కొల్లు సత్తిబాబు తదితరులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chandrababu who deceived the people