Thaneti Vanitha : రాష్టాన్ని ఆదోగతి పాలుచేస్తున్న చంద్రబాబు

TRINETHRAM NEWS

18 వ డివిజన్ రచ్చ బండ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ హోమ్ మంత్రి తానేటి వనిత

రాజమండ్రి రూరల్ నియోజవర్గం స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ లో ఈరోజు 18 వ డివిజన్ ఇంచార్జ్ అంగాడ సత్యప్రియ ఆధ్వర్యంలో రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

త్రినేత్రం న్యూస్ నవంబర్ 17, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మరియు మాజీ హోం మంత్రివర్యులు తానేటి వనిత, హాజరయ్యారు.

వనితమ్మ మాట్లాడుతూ ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు పోలీసు వ్యవస్థను తమ చేతుల్లో పెట్టుకుని రాష్టాన్ని అస్తవ్యస్తంగా మార్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన ఏదో ఒక విధంగా తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదని ఇంకో మూడున్నర సంవత్సరాల తర్వాత తిరిగి జగనన్న ముఖ్యమంత్రి అవుతారని ఆరోజు అధికారం తమ చేతుల్లో ఉంటుందని మేము మీలానే కక్ష సాధింపు చేయాలి అని అనుకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు,మా ప్రభుత్వ హయాంలో ప్రజల రక్షణ పట్ల అంకిత భావంతో పరిపాలన చేశామని ఈరోజు ఆది కూటమి ప్రభుత్వం చేయలేక పోతుందని అన్నారు.

వేణు మాట్లాడుతూ రాష్ట్రము అన్ని విధాలా దివాలా తీసింది అని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి కొత్తగా జరిగిన మేలు ఏమీ లేదని గతంలో జగన్మోహన్ రెడ్డి, తెచ్చినటువంటి పెట్టుబడులను ఈరోజు లోకేష్, తెచ్చినట్టుగా చంద్రబాబు, ప్రజలను మభ్యపెడుతున్నారని,తన కుమారుడికి ఖ్యాతి కోసం గత ప్రభుత్వం తెచ్చిన పెట్టు బడులను కూడా తమ కుమారుడు తెచ్చినట్టుగా చెప్పుకుంటున్నారని అన్నారు,ఈ రోజున రాష్ట్రంలో నేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గతంలో ఏ ప్రభుత్వం చేయనట్టుగా జగన్మోహన్ రెడ్డి , సంవత్సరానికి 24 వేల రూపాయలు చొప్పున ప్రతి నేత కార్మికుడి కుటుంబానికి అందేలా ఒక పథకాన్ని ప్రవేశ పెట్టారని కరోనా కష్టకాలంలో కూడా ఒక్క సంవత్సరంలో రెండు సార్లు ఈ పథకాన్ని నేతన్నలకు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chandrababu is making the state prosperous

You cannot copy content of this page

Scroll to Top