త్రినేత్రం న్యూస్. ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పిలుపు… కాకినాడ, మార్చి,06:ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం కాకినాడ కమిటీ సమావేశం బొబ్బిలి శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం సాయంత్రం కాకినాడలో స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగింది. ఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 11వ తేదీన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక, ఉద్యోగులు పర్మినెంట్ ఆప్కాస్, స్పెషల్ శానిటేషన్,టాయిలెట్ వర్కర్స్, ఇంజనీరింగ్ సిబ్బంది, స్కూల్స్ స్వీపర్స్ తదితరులు మార్చి 11వ తేదీన చలో విజయవాడకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
పర్మినెంట్ ఉద్యోగులకు సరెండర్ లీవ్స్, ఎన్కౌస్మెంట్ డి ఎ లు సత్వరమే విడుదల చేయాలని, మృతి చెందిన, రిటైర్మెంట్ అయినా వారి కుటుంబీకులకే పనులు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగ వలె ఆప్కాస్ కార్మికులకు 62 సంవత్సరాలకు వయసు వయోపరిమితి పెంచాలని, ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఇంజనీరింగ్ సిబ్బందికి గత సమ్మెలో వేతన ఒప్పందాలు అమలు చేయాలని, స్కూల్స్ స్వీపర్ని తక్షణమే పర్మినెంట్ చేసి వారికి జీతాలు పెంపుదల చేయాలని, సమాన పనికి సమాన వేతనం కనీస వేతనాలు 35 రూ పాయలు అమలు చేయాలని, ఆరు నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపులు నిర్వహించాలని తదితర డిమాండ్ల సాధనకై విజయవాడలో మహా ధర్నా జరగనున్నదని ఈ ధర్నా జయ ప్రధానికై కార్మికులు తరలి రావాలని ఆయన అన్నారు.
ఆప్కాస్ ను రద్దు చేస్తే మున్సిపల్ కార్మికుల జీతభత్యాల చెల్లింపు, పనులు అప్పగింత మున్సిపల్ శాఖకి బాధ్యతలు అప్పగించాలని దీనికి మున్సిపల్ శాఖ మంత్రి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. మున్సిపల్ శాఖకు బాధ్యతలు అప్పగించకుండా బడా ప్రైవేట్ వ్యక్తులకు వారి ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టాలని చూస్తే ఏఐటీయూసీ,అనుబంధ సంఘం మున్సిపల్ కార్మికులు ఆధ్వర్యంలో ఉవ్వెత్తను ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ప్రసాద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, బంగారు రాజేష్, మంగళగిరిఎల్లారావు, సింగంపల్లి రమణ, కౌలు శ్రీను, నక్క లక్ష్మణ్, కటారిసత్యనారాయణ, దుర్గ,బండి అప్పన్న, సింగంపల్లి శ్రీనివాస్, ముత్యాల సత్యనారాయణ, నిమ్మకాయలు విక్కీ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


