
త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి జనసేన పార్టీ మండల కేంద్ర కార్యాలయంలో మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో పిఠాపురం లో మార్చి 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరుగును. కావున ఈ కార్యక్రమం సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ చలో పిఠాపురం పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ ములకలపల్లి మండలంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పిఠాపురంలో జరగబోయే ఆవిర్భావ సభకు వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గరికే రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి గొల్ల వీరభద్రం, ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, సహాయ కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, ముఖ్య నాయకులు గద్దల రవి, గ్రామ కమిటీ నాయకుడు గోపగాని సాయి ప్రకాష్, కుంజ రాము, వీర మహిళలు తాణం కావ్య, సున్నం రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
