జూన్ 26, 2026
TRINETHRAM NEWS
chain stolen from old woman's

Gold Chain Stolen : జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం,పెద్దమడూరు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది.గ్రామానికి చెందిన కప్పరి యాదమ్మ అనే వృద్ధురాలి ఇంటిపై పడ్డ గుర్తుతెలియని దొంగ,ఆమె మెడలోని సుమారు 5 తులాల బంగారు గొలుసుతో పాటు నగదును లాక్కొని పరారయ్యాడు.దొంగతనం అనంతరం పారిపోయే క్రమంలో నిందితుడు కంగారులో తను వచ్చిన బైక్‌ను కొద్ది దూరంలో తన చెప్పులను ఘటనా స్థలంలోనే వదిలివెళ్లాడు.

బాధితురాలి కుమారుడు కప్పెర కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.సదరు వాహనం నెంబర్ ఆధారంగా రెండు బృందాలుగా ఏర్పడి క్లూస్ సేకరిస్తూ నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ఎస్సైఊర సుజన్ కుమార్ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page