
ఇప్టా జాతీయ నాయకులు కవ్వంపల్లి స్వామి విజ్ఞప్తి.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రజా కళాకారుడు, సిపిఐ నాయకుడు అమరజీవి కామ్రేడ్ జాకబ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 9 న ఉదయం 10.30 గంటలకు గోదావరిఖని న్యూ అశోక్ టాకీస్ ముందు జరుగుతుందని , అనంతరం స్మారక సభ భాస్కరరావు భవన్లో జరుగుతుందని ఇప్టా జాతీయ నాయకులు కవ్వంపల్లి స్వామి ఒక ప్రకటన లో పేర్కొన్నారు.
ఇట్టి ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య లతో పాటు వివిధ రాజకీయ, ట్రేడ్ యూనియన్ నాయకులు హాజరౌతారని ఆయన అన్నారు. సింగరేణి కార్మికులు, కళాభిమానులు, సిపిఐ ఏఐటియుసి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆయన విజ్ఞప్తి చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
