సివిల్ సప్లయీస్ హమాలీల సమ్మె విరమణ
హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
07 జనవరి 2025
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లయీస్ మరియు జిసిసి హమాలీ కార్మికుల ఎగుమతి, దిగుమతి హమాలీ రేట్ల ఒప్పందం అమలు చేస్తూ వెంటనే జి.ఓ. విడుదల చేయాలని, జనవరి 1 నుండి ఈ రోజు వరకు 7 రోజులు జరిగిన రాష్ట్ర వ్యాపితంగా సమ్మెను కొనసాగిస్తుండగాఈ రోజు ఎర్రమంజిలోని జలసౌధ ఇరిగేషన్ శాఖ రాష్ట్ర కార్యాలయంలో పౌరసరఫరాల శాఖామాత్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడవెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్, సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు తదితరులతో కూడిన ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో అక్టోబర్ 4న జరిగిన వేతన ఒప్పందం ప్రకారం హమాలీ రేట్లను వెంటనే పెంచి అమలు చేయాలని చాడ వెంకట్ రెడ్డి మంత్రి గారికి వివరించగా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ 2 రోజుల్లో జి.ఓ.ను విడుదల చేస్తామని దానికి అనుగుణంగా సమ్మెను విరమించాలని కోరినారు.
అక్టోబర్ 4న జరిగిన ఒప్పందంలో భాగంగా పెరిగిన హమాలీ రేట్ల బకాయిలను చెల్లించాలని కోరగా చెల్లిస్తామని అదే విధంగా స్వీపర్లకు, హమాలీలకు యూనిఫాం కుట్టుకూలితో సహా చెల్లిస్తామని, బోనస్‌ను రూ.7500/- చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నామని, దసరా పండుగ సందర్భంగా ఇచ్చే స్వీటు బాక్సు రూ.900 లకు పెంచిన అగ్రిమెంట్ ప్రకారం ఇస్తామని హమాలీలు ఆందోళన చెందొద్దని మంత్రి విజ్ఞప్తి మేరకు కార్మిక సంఘాల నాయకులుగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్, సివిల్ సప్లయీస్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ఓమయ్య, సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, సివిల్ సప్లయీస్ హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సధాకర్, టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, రాష్ట్ర,జిల్లాల నాయకులతో సంప్రదించి మెజార్టీ నిర్ణయం ప్రకారం సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించారు. గత 7 రోజులుగా ఐక్యంగా సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేసిన సివిల్ సప్లయీస్, జిసిసి హమాలీ సోదరులకు మరియు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App