సెప్టెంబర్ 13, 2026
TRINETHRAM NEWS
CCTV Cameras Inaugurated

‘నేను సైతం 2.0’లో భాగంగా ఏర్పాటు.. నేరాల నియంత్రణకు దోహదం: డీసీపీ శ్రీనివాసులు

CCTV Cameras Inaugurated : హైదరాబాద్ నాగోల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నాగోల్‌ కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న ‘నేను సైతం 2.0’ కార్యక్రమంలో భాగంగా నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన 74 సీసీటీవీ కెమెరాలను ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ డీసీపీ బి. శ్రీనివాసులు, నాగోల్‌ ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ మక్బూల్‌ జానీ బుధవారం ప్రారంభించారు.

కృషినగర్‌లోని పల్లవి డీబీఆర్‌ అపార్ట్‌మెంట్స్‌లో 30 కెమెరాలు, రాఘవేంద్రనగర్‌ కాలనీ, తట్టి అన్నారం డబుల్‌ బెడ్‌రూమ్‌, అన్నవరపు సత్యనారాయణ కాలనీల్లో మరో 44 కెమెరాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ‘నేను సైతం 2.0’ ద్వారా ఇప్పటివరకు 2,58,457 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎల్‌బీనగర్‌ జోన్‌లో 81,183 కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటి ఏర్పాటులో 104 మంది ప్రజలు భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తున్న సీసీటీవీలు నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, ప్రజల భద్రతకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు కార్యక్రమంలో ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ బి. నవీన్‌రెడ్డి, ఎస్‌ఐలు పి. శివనాగ ప్రసాద్‌, ఉమ, కాలనీ ప్రతినిధులు, అపార్ట్‌మెంట్‌ వాసులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page