TRINETHRAM NEWS

CCC Naspur Police Station made a surprise visit to CP

బాధితులకు పోలీస్ స్టేషన్ కి వెళ్తే సత్వర న్యాయం జరుగుతుంది అనే నమ్మకం, భరోసా కల్పించాలి పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలోని సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను సందర్శించి పోలీస్ స్టేషన్ సిసిసి పిటిషన్ లను వాటి రికార్డ్ లను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజెన్ లతో మర్యాదగా మాట్లాడాలి ప్రవర్తించాలి అన్నారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, కాలనీ, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు.

బ్లూ క్లోట్స్ సిబ్బంది తో మాట్లాడి డయాల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించి వారు సంఘటన స్థలంకి త్వరగా చేరుకోవాలని సూచించారు. బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయంలో రౌడీ షీటర్స్ కేడి లు, డిసి లు, సస్పెక్ట్ షీట్స్ ల ఇళ్లను, పాయింట్ బుక్స్ లను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి,మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి ప్రకాష్ , స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ , ఎస్ఐ సుగణాకర్ ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CCC Naspur Police Station made a surprise visit to CP