TRINETHRAM NEWS

డిసెంబర్ నెలాఖరు లోగా రబీ 2022-23 టెండర్ ధాన్యాన్ని బిడ్డరుకు అప్పగించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

పెద్దపల్లి, డిసెంబర్-10: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

డిసెంబర్ 31లోగా రబీ 2022-23 సీజన్ కు సంబంధించి పెండింగ్   టెండర్ ధాన్యాన్ని తప్పని సరిగా బిడ్డరుకు అప్పగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  మిల్లర్లను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని  అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంభందిత అధికారులతో  పెండింగ్ లో ఉన్న ఆక్షన్ ధాన్యం పై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ,  రబీ సీజన్ 2022-23 కు సంబంధించి పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 60% ఆక్షన్ ధాన్యం లిఫ్ట్ చెయ్యడం జరిగింది, పెండింగ్ ఉన్న 40% నిర్దేశిత గడువు డిసెంబర్ 31 లోగా
పూర్తి చేయాలని అన్నారు.

జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు వారికి కేటాయించిన టెండర్ ధాన్యాన్ని   వెంటనే బిడ్డరుకు అప్పగించాలని, ఆలస్యం చేస్తున్న రైస్ మిల్లులను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని నిర్దేశించిన గడువు లోగా  పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

టెండర్ ప్యాడి గడువు పెంపు ఉండదని, నిర్దేశిత సమయంలోగా మిల్లుల వారీగా తమకు కేటాయించిన లక్ష్యం పూర్తి చేయాలని అన్నారు.  

ఈ సమావేశంలోజిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App