TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 12 : కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రశాంత్ నగర్ ఇండస్ట్రీ పరిధిలోని త్రాడ్ సెక్యూరిటీ అలియాన్స్ సర్వీసెస్ కంపెనీ లో సెక్యూరిటీ గార్డ్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నా, జితేందర్ కుమార్ సెక్యూరిటీ కార్మికుడు, కొన్ని అనివార్య కారణాలవల్ల డ్యూటీ మానేయడం జరిగింది. సెక్యూరిటీ గార్డ్ జితేందర్ కుమార్ కు రావలసిన గత సంవత్సరం అక్టోబర్ నెల వేత్తనం ఇవ్వాల్సి ఉండగా త్రాడ్ ఐ సెక్యూరిటీ ఆలియన్స్ సర్వీస్ సెక్యూరిటీ కాంటాక్ట్, వేత్తనం ఇవ్వకుండా దుర్భాషలాడి సెక్యూరిటీ గార్డ్ ను నిర్లక్ష్యం చేస్తూ పంపించేవాడు సెక్యూరిటీ కార్మికునికి ఏం చేయాలో అర్ధం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి సెక్యూరిటీ మిత్రులు ద్వారా తెలుసుకొని, బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి కార్యాలయం వద్దకు వెళ్లి సెక్యూరిటీ గార్డ్ కి జరిగిన అన్యాయం గురించి చెప్పారు, వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవి హుటాహుటిన త్రాడ్ ఐ సెక్యూరిటీ అలియాన్స్ సర్వీసెస్ సెక్యూరిటీ మేనేజ్ మెంట్ దగ్గరికి వెళ్లి సెక్యూరిటీ కార్మికుడికి గత సంవత్సరం అక్టోబర్ నెల వేత్తనం రావాల్సి ఉండగా వెంటనే మాట్లాడి, సెక్యూరిటీ గార్డ్ జితేందర్ కుమార్ కు రావాల్సిన వేత్తనం ఇప్పించడం జరిగింది. సెక్యూరిటీ గార్డ్ జితేందర్ కుమార్ మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRTU State Labor Leader