TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని BRS భవన్ (జిల్లా BRS పార్టీ కార్యాలయం) లో నిర్వహించిన వికారాబాద్ నియోజకవర్గం, బంట్వారం మండల BRS పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.

సమావేశంలో భాగంగా మండలం లోని BRS పార్టీ నాయకులు & కార్యకర్తల అభిప్రాయం మేరకు సీనియర్ నాయకులు, AMC మాజీ చైర్మన్ మల్లేశం ని బంట్వారం మండల BRS పార్టీ అధ్యక్షులు అశోక్ ముదిరాజ్ ముదిరాజ్ ని ఉపాధ్యక్షులు అల్లాపురం శ్రీనివాస్ ని కార్యనిర్వాహక అధ్యక్షులు, ఖాజా పాషా ని జనరల్ సెక్రెటరీ, చంద్రశేఖర్ రెడ్డి ని బంట్వారం మండల యువజన విభాగం అధ్యక్షులు గా నియమించారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైనవారికి జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ…

ఈ నెల 27 న వరంగల్‌ లో నిర్వహించనున్న రజతోత్సవ సభ కు పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేద్దాం.

గతంలో లాగా పార్టీలో వర్గాలు ఏర్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది.

సాధారణంగా ఏ పార్టీలో అయినా అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం పోటీ ఉండడం సర్వసాధారణం కానీ ప్రస్తుతం BRS పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్నప్పటి కంటే ఎక్కువ పోటీ నెలకొంది.

పార్టీలో పదవిలో కొనసాగుతున్న ఏ వ్యక్తి అయినా అధిష్టానం యొక్క ఆదేశాల్ని శిరసా వహించాలి.

చెడుని చూశాక మంచి విలువ తెలుస్తుంది అన్నట్టుగా.. మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని చూశాక కేసీఆర్ విలువ తెలుస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలందరూ కేసీఆర్ ని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం మన పార్టీలో నకిలీ నాయకులు అందరూ వెళ్లిపోయి వికాసైనా నాయకులు మాత్రమే మిగిలారు.
ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకుల్లో పార్టీ కోసం కష్టపడే చాలామంది భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండబోతున్నారు.

ఇకపై పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

భవిష్యత్తులో కూడా కేవలం పార్టీ బలోపేతానికి కృషి చేసే నికాసైన నాయకులు మాత్రమే పార్టీలో కొనసాగుతారు.

తెలంగాణలో మళ్ళీ రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.

ఈ సమావేశంలో TSEWIDC మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, BC కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, వికారాబాద్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్, సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డి, మేక చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మర్పల్లి మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి వికారాబాద్ మండల అధ్యక్షులు నారెగూడెం మహిపాల్ రెడ్డి, మండల సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షులు నర్సింలు, వికారాబాద్ పట్టణ కార్య నిర్వాహక అధ్యక్షులు సుభాన్ రెడ్డి, వికారాబాద్ మండలం కార్య నిర్వాహక అధ్యక్షులు పడిగళ్ళ అశోక్, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్, PACS మాజీ డైరెక్టర్ బల్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS government will come