TRINETHRAM NEWS

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు.

ఏప్రిల్ 2న అన్ని జిల్లాల కలెక్టర్లుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతిపత్రాలు ఇస్తారని చెప్పారు. అదే రోజున హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి మెమెరాండం సమర్పిస్తారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేది లేదన్నారు. రైతులకు హామీ ఇచ్చినట్లుగా రూ.500 పంట బోనస్ ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల పక్షాన పోరాడాటానికి బీఆర్ఎస్, కేసీఆర్ ఉన్నారని భరోసానిచ్చారు. సాగు నీరు లేక పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామయ్య పద్దతిలో ప్రభుత్వంపై యుద్ధం చేద్దామన్నారు.