కొంపముంచిన ఎలక్ట్రానిక్ బైక్
Trinethram News : జగిత్యాల జిల్లా :నవంబర్ 22
నిన్న జగిత్యాల జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటన పాఠకులకు తెలిసిందే.. జగిత్యాల రూరల్ మండ లం బాలపెల్లి గ్రామానికి చెందిన భేతి తిరుపతి రెడ్డి కొద్దిరోజుల క్రితం ఎలక్ట్రి టిక్ బైక్ కొనుగోలు చేశాడు.. వ్యవసాయ పనుల కోసం.. ఈ బైక్ ను వినియోగిస్తున్నాడు..
అయితే గురువారం ఛార్జింగ్ తగ్గడం తో ఇంటి ఆవరణలో ఉన్న ఫ్లగ్ లో ఛార్జింగ్ పెట్టారు తిరుపతి రెడ్డి. పెట్టిన కొద్దీ నిమిషాల్లో బైక్ పెళ్లిపోయింది, మంట లు వ్యాపించాయి.. ఇంటి కి మంటలు అంటుకున్నాయి. ఇళ్ళు ముందు భాగం కాలిపోయింది, బైక్ తోపాటు….
బైక్ డిక్కీ లో ఉన్న లక్ష 90 వేయిల రూపాయలు కాలి బూడిదయ్యాయి..దీంతో.. ప్రాణాలు కాపాడుకోవ డానికి కుటుంబ సభ్యులు పరుగులు తీశారు.బైక్ కొనుగోలు చేసి కేవలం 40 రోజులు అయిందని ఇంత లోనే ఇలా పేలిపోవటంతో బాధితులు బోరు మంటున్నారు.
బైక్ డీలర్ తో వాగ్వాదానికి దిగారు. బైక్‌తోపాటు డిక్కీలో కాలిపోయిన డబ్బులు కూడా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. వరి దాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు బైక్ డిక్కీ లో దాచి పెట్టామని తిరుపతిరెడ్డి, వాదన..
ఈ డబ్బులన్నీ కాళిపో యాయి.. తమకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు బాధితుడు తిరుపతి రెడ్డి, చూడాలి మరి తిరుపతి రెడ్డికి ఎటువంటి న్యాయం జరుగుతుందో…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App