TRINETHRAM NEWS

ఢిల్లీ పీఠంపై భాజపా జెండా

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 9: నెల్లూరు జిల్లా :కావలి. కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకటో పట్టణ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ అధ్యక్షతన శనివారం నాడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించిన సందర్భంగా కావలి పట్టణంలోని శివాజీ సెంటర్ నందు పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. ఢిల్లీ గడ్డ భాజపా అడ్డా అంటూ నినాదాలు చేశారు. ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారని, సంక్షేమం అభివృద్ధిని ప్రధాన అజెండాగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బ్రహ్మానందం, సి .వి .సి, సత్యం, అమరా వెంకట సుబ్బారావు, అంచిపాకు కమల, వింత రంగారెడ్డి, కూరాకుల సవీంద్ర మద్దిశెట్టి నరేంద్ర, సుందరశెట్టి సుజి, కోడూరు మురళీకృష్ణ, మట్ట మల్లికార్జున, పాదర్తి సుబ్బారావు, మొగుళ్ళపల్లి రాజా, తూమాటి తిరుపతి స్వామి, మామిడి వెంకటేశ్వర్లు, కామాక్షమ్మ, తిరుపతయ్య, ప్రసన్నకుమార్ సుబ్రహ్మణ్యం ,రాకేష్ మణిదీప్, మేఘనాథ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP flag on Delhi