TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు. బిక్కవోలు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీలు కొర్ల చక్కెర రావు, జంపా వెంకటలక్ష్మి, గొర్రెల భాగ్యలక్ష్మి, తొండపు శాంతి శ్రీలక్ష్మి, సువర్ణ లత, చిన్నం వీర రాఘవరెడ్డితో కలిసి బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ మీడియాతో మాట్లాడుతూ

తామేదో డబ్బుకి అమ్మడు పోయినట్లు, బెదిరించి బిజెపిలో చేర్చుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తామే ఇష్టపూర్వకంగా బిజెపిలో చేరినట్లు తెలిపారు.

ఎంపీటీసీ చిన్నం వీరరాఘవరెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీగా ఎన్నికై మూడున్నర సంవత్సరాలు అయిందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎంపీటీసీగా తనకు ఓ గుర్తింపు లభించిందన్నారు.వైసిపి పాలనలో తనకు ఎలాంటి గుర్తింపు ఉండేది కాదన్నారు. గత ప్రభుత్వ కాలంలో కనీసం ఎమ్మెల్యే ని కలిసేందుకు కూడా వీలు అయ్యేది కాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ఎంపీటీసీగా ఎన్నికైతే తమ సమస్యలను కూడా పరిష్కరించలేక పోయే వాళ్ళమని వాపోయారు. తామె ఎవరు ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదని ఇష్టపూర్వకంగానే బిజెపిలో చేరామని తెలిపారు.

ఎంపీటీసీ తొండపు శాంతి శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. తమనెవరు ఇబ్బంది పెట్టడం కానీ డబ్బులు ఇచ్చి పార్టీలో చేర్చుకోవడం కానీ చేయలేదని తమ ఇష్టపూర్వకంగానే బిజెపిలో చేరినట్లు చెప్పారు. ఎంపీటీసీగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు తమ పదవికి న్యాయం చేయలేదని, పార్టీ మారితే తమకు తగిన గుర్తింపు వస్తుందని, ప్రజా సమస్యలను పరిష్కరించవచ్చు అనే ఆలోచనతోనే పార్టీ మారినట్లు ఆమె చెప్పారు.

ఎంపీటీసీ గొర్రెల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తను ఇష్ట ప్రకారమే బిజెపిలో చేరానన్నారు.

మరో ఎంపీటీసీ జంపా వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. వైసిపి నుంచి బిజెపిలోకి ఇష్టపరకారం వచ్చామన్నారు. గతంలో ఎంపీటీసీ లందరూ పూర్వపు ఎంపీపీ జ్యోతిర్మయి శేషు కుమార్ కి మద్దతుగా నిల్చమని అయితే ఆమె మధ్యలోనే విడిచి పెట్టేసారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆమె రాజీనామా చేసి వెళ్లిపోయి ఎంపిటిసి లందరూ ఏమయ్యారని ఆలోచన కూడా చేయలేదని దీంతోనే తాను పార్టీ మారినట్లు తెలిపారు. తను పార్టీ ఎవరు ప్రలోభ పెట్టలేదని ఆమె చెప్పారు.

ఎంపీటీసీ కొర్ల చక్ర రావు మాట్లాడుతూ.. తనని ఎవరూ భయపెట్టలేదని ఎవరు డబ్బు ఇవ్వలేదని తాను బిజెపిలో చేరాలనే ఉద్దేశంతోనే పార్టీ మారినట్లు చెప్పారు. గత ఎంపీపీ మధ్యలోనే రాజీనామా చేసి వెళ్లిపోవడంతో తాము బిజెపిలోకి వచ్చినట్లు చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉండేవాడిని అనంతరం వైసీపీలో చేరి ఎంపీటీసీగా గెలుపొందనన్నారు. అయితే తనకు ఎంపీటీసీగా వైసీపీలో విలువ లేకపోవడంతోనే పార్టీ మారినట్లు చెప్పారు.శకునిమామకు పుట్టిన బిడ్డకు మీరు తండ్రి అని చెప్పుకుంటున్నట్లు ఉంది మాజీ MLA?

ఎవరో వ్రాసిచ్చిన స్క్రిప్టుని మీరు చదవడం అంటేనే ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు తండ్రి అని చెప్పుకోవడం లాంటిదే మాజీ MLA

మీరు ప్రకటించిన యంపిపి అభ్యర్ధి ఎందుకు నామినేషన్ వేయలేదో చెప్పండి? మిమ్మల్ని సమర్దిస్తున్న యంపిటిసిలు ఎందుకు ఓటింగ్ కి రాలేదు?

మూడున్నరేళ్ళు యంపిపిగా వెలగబెట్టిన వారు మౌనంగా ఎందుకు ఉన్నారు?

శకునిమామకి స్క్రిప్టురచనల నుండి తప్పించాల్సిన సమయం వచ్చింది. యన్టీరామారావు కి ఇవ్వాల్సిన స్క్రిప్టు అల్లురామలింగయ్యకు ఇస్తే ఎలా? – MLA నల్లమిల్లి వ్యాఖ్యలు

పాత్రికేయుల సమావేశంలో MLA నల్లమిల్లి మాట్లాడుతూ…

బిక్కవోలు MPP ఎన్నిక విషయంపై అసహనంతో మాజీ MLA సత్తి సూర్యనారాయణరెడ్డి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన మాట్లాడిన రెండు పదాలు ‘ఎవరో కక్కిన కూడుకి మీరు ఎంగిలి మెతుకులకు ఆశ పడ్డారు’ అని ఒకటి, ‘ఎవరికో పుట్టిన బిడ్డను మీకు పుట్టినట్లు చెప్పుకున్నారు’ అని ఒకటి.ఈ రెండో మాట ఆయన పలకలేకపోయారు కానీ స్క్రిప్టు రచయిత శకునిమామ మాత్రం పోస్టు చేసేసాడు.

ఈ రెండు పదాలకు ఆయననే ఉదాహరణగా చెపుతున్నా.. ఎవడో వ్రాసిచ్చిన స్క్రిప్టుని చదివేవారిని ఏమంటారు. ఎవరికో పుట్టిన బిడ్డ అంటే శకుని మామకి పుట్టిన బిడ్డని ఈయన ప్రెస్మీట్లలో తన బిడ్డగా చెప్పుకునే దౌర్భాగ్య స్ధితి సూర్యనారాయణ రెడ్డి గారిది.

కనీస పరిజ్ఞానం, కనీస అవగాహన లేకుండా ఎవడో స్క్రిప్టు వ్రాసిస్తే దానిని పలకలేని వ్యక్తి ఈయన. కనీసం చదవడం రాదు ఈయనకు. పూర్వం చిన్నపిల్లలకు బట్టీ పట్టించేవారు అలా పదిసార్లు బట్టీ పట్టి అయినా ప్రెస్ ముందు మాట్లాడాలి.

స్క్రిప్ట్ వ్రాసిచ్చేవారికి ఒకటే చెపుతున్నా.. యన్టీరామారావు కి ఇచ్చిన స్క్రిప్టు అల్లు రామలింగయ్యకు ఇవ్వకూడదు. యన్టీఆర్ స్క్రిప్టు యన్టీఆర్ కు అల్లు రామలింగయ్య స్క్రిప్టు అల్లు రామలింగయ్యకు ఇవ్వాలి.

శకునిమామకి అడ్వైజ్ ఇస్తున్నా… శకుని మామ .. మీ అల్లురామలింగయ్యకి ఆ స్కిప్టునే వ్రాసి ఇవ్వండి తింగరి గంగిరెడ్డికి లేకపోతే ఆయన చదవలేక ప్రజల ముందు అపహాస్యం పాలవుతారు.

ఇక్కడ యంపిటిసిలంతా ఒక అభిప్రాయం చెప్పారు ఇక్కడ మూడున్నరేళ్ళుగా మండల పరిషత్ లో రాచరికపు పోకడతో పరిపాలన చేసారు. ఆ యంపిపి యంపిటిసిలకు కనీస గౌరవం ఇవ్వని పరిస్ధితి. ఎవరైనా సమస్య ఉంటే స్లిప్ వ్రాసి ఇవ్వాల్సిందే. ఎవరైనా పొరపాటున సమస్య గురించి మండల పరిషత్ సమావేశంలో ప్రస్తావిస్తే సదరు యంపిపి ఆగ్రహానికి గురికావలసిందే. ఇక ఆమె భర్త ఒక రాజులా సింహాసనంపై కూర్చుని శాసించడం ఇలాంటి పోకడలతో యంపిటిసిలంతా తీవ్ర విసుగు చెందారు.

మరో ప్రక్క నాటి MLA వారి సతీమణి. వీరిది మరో రకమైన రాచరికపు పోకడ. యంపిటిసిలకు, స్ధానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రధాన్యత ఇవ్వాలని వారికి అనిపించదు. ఇటువంటి ప్రవర్తనతోనే యంపిటిసిలంతా విసుగు చెందారు.

మాజీ MLA ప్రశ్నలు వేసే ముందు మీ మాజీ MPP ఎందుకు రాజీనామా చేసారో తెలుసుకోవాలి. అందరినీ నడిసంద్రంలో వదిలేసి ఇంట్లో కూర్చోవడంలో ఆంతర్యమేమిటి? ఈవిడేదో సవాల్ చేసింది అందుకోసం రాజీనామా చేసింది అనుకోవడంలో వాస్తవం లేదని ప్రజలకు తెలియజేస్తున్నా.

అధికారం వస్తే ఆకతాయి చేష్టలు చేయడం, అధికారం పోతే కుక్కిన పేనుల్లా ఉండటం వీరికి అలవాటు. 2014-19 కాలంలో కూడా వీరు ఇలాగే వ్యవహరించారు. 2019-24 మధ్య పేట్రేగిపోయారు. నన్ను గానీ చంద్రబాబు ని కానీ ఉద్దేశ్యించి నాటి యంపిపి ఎలాంటి అవాకులు, చవాకులు మాట్లాడారు నేడెందుకు స్తబ్దత వహించారో సూర్యనారాయణరెడ్డి సమాధానం చెప్పాలి.

ఇక్కడ యంపిటిసిలు మీ ప్రవర్తనకు విసిగిపోయి, వారికి కనీస గౌరవం దక్కకపోవడంతో ఈరోజు బిజెపిలో చేరి తేతలి సమ ని యంపిపిగా ఎన్నుకున్నారు. అసలు మీ అభ్యర్ది నామినేషన్ ఎందుకు వేయలేదు? నామినేషను వేసి ఉంటే కదా వీరంతా పార్టీ మారారో లేదో తెలిసేది? ఇది ఏకగ్రీవంగా జరిగిన ఎన్నిక. మీకు ఏకగ్రీవం అంటే కూడా తెలియదేమో!

అసలు మిమ్మల్ని సమర్ధిస్తున్న యంపిటిసిలు ఎన్నికకు ఎందుకు గైర్హాజరు అయ్యారు? వాళ్ళు తమ భాధ్యతను విస్మరిస్తా ఉంటే నియోజకవర్గ సమన్వయకర్తగా మీరెందుకు మౌనంగా ఉన్నారు?

ఇవన్నీ శకునిమామకు తెలియకపోవచ్చు అతనేదో వ్రాసిస్తే మీరు చదవలేక సతమతమవుతూ ఉంటారు. శకునిమామని స్క్రిప్టు రచనలకు దూరం చేయాల్సిన సమయం వచ్చింది. అతను మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడం కోసమే ప్రయత్నిస్తాడని చాలాసార్లు చెప్పాను నేను. ఎవడికో పుట్టిన బిడ్డ అంటే ఎవడో వ్రాసిచ్చిన స్క్రిప్టుని చదవడం అనేది మీకే వర్తిస్తుందని తెలుసుకోండి.

ఇక యంపిటిసిలను బెదిరించారు అంటున్న మీరు గైర్హాజరైన మీ యంపిటిసిలను ఎవరు బెదిరించారో చెప్పండి? యంపిటిసిలను డబ్బుతో ప్రలోభపెట్టారని చెపుతున్న మీరు మీరు అభ్యర్ధిగా ప్రకటించిన బలభద్రపురం యంపిపి ఎందుకు గైర్హాజరయ్యారో వారినెవరు ప్రలోభ పెట్టారో సమాధానం చెప్పండి. మూడున్నరేళ్ళు యంపిపిగా వెలగబెట్టిన వారు ఎందుకు ఓటింగ్ కి గైర్హాజరయ్యారో సమాధానం చెప్పి మాట్లాడండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bikkavolu MPP Thetali Suma