
త్రినేత్రం న్యూస్ :మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు.పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉం డే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ భీమ్ భరత్ అన్నారు.
మంగళ వారం మండల కేంద్రంలో కేజీఆర్ గార్డెన్ లో చేవెళ్ళ PACS చైర్మన్ దేవర సమత వెంకట్ రెడ్డి, మరియు చేవెళ్ల మాజీ సర్పంచ్ శైలజ అగిరెడ్డి, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ మాసం ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మరియు రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉప వాస దీక్ష విడిపించారు. సర్వమత సారం ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు మొయినాబాద్ మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ముస్లిం సోదరులు , అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
