TRINETHRAM NEWS

స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న భౌరంపేట్ కౌన్సిలర్ మరియు BRS పార్టీ నాయకులు..

యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మహోన్నత బావాలతో,ఆద్యాత్మిక ఆదర్శాలతో మాతృదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన “వివేకానందుడి” స్పూర్తి లో నేటి యువత నడయాడలని ఆకాంక్ష లతో భౌరంపేట్ గ్రామ BRS పార్టీ నాయకులు ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, BRS పార్టీ నాయకులు మురళీ యాదవ్, సురేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజిరెడ్డి, కొమ్ము జీవన్ తదితరులు పాల్గొన్నారు.