TRINETHRAM NEWS

ప్రతిష్టాత్మకంగా పేరెంట్ మీటింగ్ ఏర్పాట్లు.భాస్కర్ నాయుడు…
Trinethram News : ప్రకాశం జిల్లా.

కంభం: మండలంలో మెగా పేరెంట్,టీచర్ సమావేశాలకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎన్ఆర్ తురిమెళ్ల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు బుధవారం ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తూ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ నాయుడు పేరెంట్, టీచర్ మీటింగ్ ప్రాముఖ్యతను వివరించారు.ఈనెల 7న నిర్వహించనున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి తల్లిదండ్రులు తప్పక హాజరుకావాలని, విద్యార్థులందరూ ఏకరూప దుస్తులు ధరించి రావాలని తెలిపారు. ఆదేరోజు పండుగ వాతావరణంలో పాఠశాల సమగ్ర స్వరూపాన్ని, విద్యార్థుల విశేష సామర్ధ్యాలను ప్రదర్శించనున్నట్లు, విందుగా శుభతిథి భోజనాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ నాయుడు,ఉపాధ్యాయుని పి.వి.ఎన్.కళ్యాణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App