భారతీయ జనతా పార్టీ నిరసన.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
భారతీయ జనతా పార్టీ డిండి మండల శాఖ ఆధ్వర్యంలో డిండి MPDO కార్యాలయం ముందు అర్హులందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ కి మరియు MPDo కి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతావత్ లాలు నాయక్ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మంజూరు చేయాలని, రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలని అలాగే కౌలు రైతులు అందరికీ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సంవత్సరానికి 12000 రూపాయలు ఇవ్వాలని,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రానున్న స్థానిక ఎలక్షన్లలో గ్రామ గ్రామాన కాంగ్రెస్ లీడర్లని నిలదీస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు వానo నరేందర్ రెడ్డి, దేవరకొండ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ AT కృష్ణ , bjp రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాధవరం నర్సింహా రావు, డిండి మాజీ MPTC AT. రాధిక, bjp దళిత మోర్చా జిల్లా నాయకులు బర్పటి కొండల్, bjp గిరిజన మోర్చా అసెంబ్లీ కన్వీనర్ వడ్త్యా బిక్షపతి జాదవ్, bjp మండల ఉపాధ్యక్షులు, కుంభం రామకృష్ణ, bjym డిండి మండల అధ్యక్షులు మేళ్ల సాయికుమార్, కందుకూరు మాజీ ఉపసర్పంచ్ ముడి శ్రీకాంత్, bjp డిండి టౌన్ అధ్యక్షులు గాయాల రాఘవేందర్, రేణయ్య,విజయ్, గెలవయ్య, సాయి, నగేష్, రమేష్,సుధాకర్,శ్రీను,శేఖర్, ఆంజనేయులు, యాదగిరి, రవి,శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్, ప్రేమ్, చంటి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App