WhatsApp Image 2024 02 25 at 20.00.28
కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ కి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్ కేటాయించకపోవడంతో జన సైనికులు ఆగ్రహ ఆవేశాలకు లోన అవుతున్నారు.అధికార పార్టీ జన సైనికుల మీద ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ జంకకుండా పవన్ కళ్యాణ్ కు, జనసేన పార్టీని ఎలాగైనా నిలబెట్టి జనసేనాని ఆశయసాధనలో కోసం తపన పడినఎంతో మంది శ్రమ పడి నిర్మిచుకున్న నియోజకవర్గం అని వాపోయారు త్వరితగతిలో జనసేన టీడీపీ అధినేతలు తమ నిర్ణయాలు మార్చుకుని బండారు శ్రీనివాస్ కి తిరిగి ఇవ్వాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.ఆలమూరు మండలం జనసేన నాయకులు చల్లా బాబీ, గుత్తుల నాగేశ్వరావు ఆధ్వర్యంలో బీసీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొత్తపేట జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ వెంటే తమ పయనమంటూ జనసేన ఫ్లెక్సీలను తొలగించి చించేసి కాల్చారు.ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత నుంచి బండారు శ్రీనివాస్ గారు పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. తర్వాత శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం పైన అందరూ నడుస్తామని తెలియజేస్తున్నారు.
