ఘనంగా అయ్యప్ప స్వామి ఇరుముడి పూజా కార్యక్రమం
ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం పట్టణం 11 వార్డు చిట్టిరామవరం తండా నందు ఆంజనేయ స్వామి దేవాలయంలో గురు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ ఇరుముడి కార్యక్రమంలో సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి సభ్యులు 11 వార్డు కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మూడ్ రమేష్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భూక్యా శ్రీనివాస్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమము ఎంతో భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించిన అయ్యప్ప స్వాములకు అభినందించడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో ఉండాలని అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాంగా జీవించాలనీ మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బానోత్ గణేష్ నాయక్ బాలాజీ మాలోత్ వీరన్న మాలోత్ చిన్న కృష్ణ తదితర స్వాములు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App