Aurobindo Pharma’s Profit : అరబిందో ఫార్మా లాభం రూ.910 కోట్లు

TRINETHRAM NEWS

మొత్తం ఆదాయంలో 8 శాతం వృద్ధి
ఆదాయంలో అమెరికా మార్కెట్‌ వాటా 43 శాతం

Trinethram News : అరబిందో ఫార్మా డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.910 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం లాభం రూ.846 కోట్లతో పోల్చితే 8 శాతం వృద్ధి చెందింది.

సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా 8.4 శాతం వృద్ధితో రూ.7,979 కోట్ల నుంచి రూ.8,646 కోట్లకు పెరిగింది. కీలక మార్కెట్లైన అమెరికా, యూర్‌పల్లో వివిధ ఉత్పత్తుల పోర్టుఫోలియో పటిష్ఠంగా ఉండటంతో పాటు డిమాండ్‌ పెరగటం ఎంతగానో కలిసి వచ్చిందని అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్‌, ఎండీ కే నిత్యానంద రెడ్డి వెల్లడించారు.

మొత్తం ఫార్ములేషన్‌ వ్యాపారం రూ.7,683 కోట్లు

కాగా ఈ కాలంలో మొత్తం ఫార్ములేషన్‌ వ్యాపారం 10.4 శాతం వృద్ధితో రూ.7,683 కోట్లుగా నమోదైందని కంపెనీ తెలిపింది. క్యూ3లో అమెరికా ఆదాయం 2.2 శాతం వృద్ధితో రూ.3,739 కోట్లకు చేరుకోగా యూరప్‌ రెవెన్యూలు 27.4 శాతం వృద్ధి చెంది రూ.2,703 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది.

దేశీయ ఫార్ములేషన్‌ విక్రయాలు రూ.74 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ మొత్తం రెవెన్యూలో అమెరికా వాటా 43.2 శాతంగా ఉంది. క్యూ3లో మొత్తం 9 ఔషధాలను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. యూఎ్‌సఎ్‌ఫడీఏ నుంచి 7 అబ్రివేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్స్‌ (అండా)కు ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Aurobindo Pharma's profit at Rs 910 crore

You cannot copy content of this page

Scroll to Top