TRINETHRAM NEWS

అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నడిరోడ్డుపై ఆదివారం ఆరా బ్యాటరీ వాహనం దగ్ధమైంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలను తట్టుకోలేక వాహనదారులు బ్యాటరీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవికాలం అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక బ్యాటరీ వాహనాలు ఇటీవల కాలంలో చాలా చోట్ల దగ్ధమవుతున్న విషయం తెలిసిందే.

పార్క్ చేసి ఉన్న బ్యాటరీ వాహనం ఒక్కసారిగా పొగలు చిమ్ముతూ మంటలు చెలరేగడంతో స్థానికులు కంగారుపడి పరుగులు తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన సత్తి పెద్దిరెడ్డికి చెందిన బ్యాటరీ బండి. ఆరా బండి నడిరోడ్డు పై తగలబడి పోవడంతో భయ బ్రాంతులకు గురైన ద్విచక్ర వాహనదారులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

battery bike caught fire