సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో
నల్ల బ్యడ్జీలతో, ప్ల కార్డ్స్ తో నిరసనలు తెలిపి జీ.ఎం వినతి పత్రం ఇచ్చిన
సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం.
వేల్పుల కుమారస్వామి ఎస్సీ కేఎస్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు గోదావరిఖని ఎల్.బి.స్టేడియంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్జీ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ వినతి పత్రాన్ని అందించడం జరిగింది. దీనికి ముందు అర్జీ 1 లోని వివిధ సెక్షన్ల లో నల్ల బ్యాడ్జీలు, ప్ల కార్డ్స్ తో నిరసనలు తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఈ రోజు సింగరేణి డే కార్యక్రమాలను పెద్దయెత్తున నిర్వహిస్తున్నారు.
ఇందులో ప్రారంభం నుండి ముగింపు వరకు, ఊడ్చి,ముగ్గు పెట్టిన దగ్గర్నుండి, స్వీట్ బాక్స్ లు తెచ్చిన దగ్గర్నుండి అందరికీ అందించడంతో పాటు స్టేడియంను శుబ్రపరిచే వరకు ప్రతి పనిని కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నారు. కానీ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం గుర్తింపు లేదు. సింగరేణి నినాదం ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం. చదవడానికి బాగుంది కానీ ఇందులో కాంట్రాక్ట్ కార్మికులకు చోతులేదన్నారు.
ఎందుకంటే పర్మినెంట్ కార్మికులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ వేతనాల్లో తేడాలున్నాయని, కొర్టర్లు కేటాయించడంలో వివక్షత ఉందని, పండుగ,జాతీయ సెలవులు ఇవ్వడంలో, మరియు ప్రమాదంలో మరణించిన వారికి నష్టపరిహారం చెల్లించడంలోనే కాకుండా కాంట్రాక్ట్ కార్మికులను చూసే చూపులోను నిర్లక్ష్యం, వివక్షత ఉందని అన్నారు. ఇలాంటప్పుడు ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం. నినాదాలు ఎందుకని ప్రశ్నించారు.
2022 లో జరిగిన 18 రోజుల సమ్మెలో సింగరేణి యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లను ఇప్పటికీ అమలు చేయలేదంటే సింగరేణికి కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించుకోవడమే తెలుసుకానీ వారి సమస్యలు పరిష్కరించాలనే సోయి లేకపోవడం సిగ్గుచేటన్నారు. కన్వేయన్స్ డ్రైవర్లు అధికారుల వెహికిల్స్ నడుపుతారు కానీ వారికి కనీస వేతనాలు అమలు అవుతున్నాయా?లేవా అని పట్టించుకోరు ఎవరు ఎక్కడపోతే నాకేంటి నా అవసరం తీరిందా? లేదా? అనే దోరణిలో యాజమాన్యం ఉందని అన్నారు.
ఇప్పటికైన సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, 22 నెంబర్ జీ.ఒ. గురించి యాజమాన్యం కాంగ్రెస్ పభుత్వం ఇందన శాఖా మంత్రి రాసిన లేఖ పై స్పందించాలి,
ఖాళీ కొర్టర్లు ఇవ్వాలి, పి.ఎఫ్, ఈ.ఎస్.ఇ. సౌకర్యం కల్పించాలి. ప్రతినెలా 7వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలి.
కన్వేయన్స్ డ్రైవర్లకు గతంలో బిల్లుల నుండి రికవరీ చేసిన 15 శాతం డబ్బులు డ్రైవర్లు అకౌంట్ లో వేయాలి. వీటితో పాటు పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య, అర్జీ 1 అద్యక్ష, కార్యదర్శులు పి.రాజు, సిహెహ్.ఉపేందర్, ఉపాధ్యక్షులు ఇండ్ల ఓదెలు,నాయకులు టి.నరహరి రావు, చంద్రయ్య,కిరణ్, రాజయ్య,అంజి,వినోద, ప్రసాద్, ఖాళీ, జీన,చిలకమ్మ,శాంతి, కుమారి, లక్ష్మీ,శ్రీను, క్రిష్ణ,వేణి, రఘు, రాజేష్, సంతోష్, శ్రావణ్, సంపత్,శంకర్, సది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App