WhatsApp Image 2023 12 21 at 12.11.34 PM
జాబ్ క్యాలెండర్ పై వైయస్ జగన్ మాట తప్పాడు : అశోక్ నాయుడు
అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి నిరుద్యోగులను నిండా మోసం చేశారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద ముఖ్యమంత్రి జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాబ్ క్యాలెండర్ ను బలవంతంగా చంపేశారని ఆరోపిస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నేతలు నరేష్, సాయి కృష్ణ మదన్ సాయిరెడ్డి, లెక్కల రాజశేఖర్ రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
