TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా
మైలవరం నియోజకవర్గం
కొండపల్లి

కొండపల్లి లో ప్రసిద్ది గాంచిన హజరత్ సయ్యద్ షాబుఖారి దర్గా లో 427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి

వివిధ మతాలకు సంబంధించిన మత గురువులు, పీఠాధిపతులు,చర్చి ఫాదర్ లు కూడా హాజరవుతారని ముస్లిం మతగురువు అల్తాఫ్ రాజా తెలిపారు

సుమారు 2లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు

హాజరయ్యే భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాట్లను నిత్యాన్నదాన భవనం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు దర్గా కమిటీ సభ్యులు

డిప్యూటీ సిఎం అంజాద్ భాషా చొరవతో సీఎం స్పందించి దర్గా కి రహదారి ని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం హర్షదాయకమని ఈ సంధర్బంగా నిర్వాహకులు తెలిపారు

గతంలో రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జి నుండి దర్గా వద్దకు రావాల్సి ఉండడంతో వృద్దులకు,రోగులకు ఇబ్బందిగా ఉండేదని,బ్రిడ్జి క్రింద నుండి రోడ్ ని ఏర్పాటు చేయడంతో సునాయాసంగా దర్గా కు చేరుకోవచ్చని ఆనందం వ్యక్తం చేశారు

ఎన్టీటీపీఎస్ గతంలో ఆగిపోవడంతో మహత్తు కలిగిన బాబా దర్గా కి దారిని ఏర్పాటు చేసిన నాటినుండి నిర్విరామంగా నడుస్తుందని నిర్వాహకులు తెలిపారు

దర్గా లో బాబా సమాధి తో పాటు ఆర్కియాలజీ శాఖ రికార్డ్స్ లో నమోదు కాబడిన సర్వరోగ నివారిణి గా పిలువబడే షిఫా భావి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది