TRINETHRAM NEWS

సిఐటియు సుదీర్ఘ పోరాటం చేసే సాధించిన మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు పరిశీలించిన అర్జీ1, బ్రాంచి నాయకులు,

మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు

బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి మండే శ్రీనివాస్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆర్జీవన్ బ్రాంచి కమిటీ నాయకులు అందరూ, జీడీకే 1, ఇంక్లైన్ ఫ్యాన్ హౌస్ వద్ద సిఐటియు కార్మికుల పోరాటంతో సాధించిన. మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని సింగరేణి యాజమాన్యం నిర్మిస్తున్న పనులను పరిశీలించారు, ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి మండే శ్రీనివాస్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా రామగుండం ప్రాంతంలోని సింగరేణి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు శుద్ధమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున పోరాటం చేశామని, ఆ పోరాట ఫలితంగా సింగరేణి యాజమాన్యం 18 కోట్లతో గ్రాటివిటీ ఫిల్టర్ బెడ్డు నిర్మాణ పనులు చేపట్టారని ఈ పనులు నత్తనడకన సాగుతున్న దృష్ట్యా సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేసి కార్మికులందరికీ త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు, త్వరితగతిన పూర్తి చేసేందుకు సింగరేణి ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ దృష్టి సారించాలని కోరారు, అలాగే స్థానిక రామగుండం ఎమ్మెల్యే చొర చూపాలని ఈ నిర్మాణ పనులు పూర్తయ్యేంతవరకు మిషన్ భగీరథ ద్వారా రామగుండం పారిశ్రామిక ప్రాంత సింగరేణి కార్మిక కుటుంబాలకు మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు, త్రాగునీటి సమస్యతోటి సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలియజేశారు ఇప్పటికైనా అర్జీ1, సింగరేణి యజమాన్యం స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యక్ష దృష్టి సారించి నిర్మాణ పనులు పూర్తి చేసి త్రాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో బ్రాంచి నాయకులు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, విజయ్ కుమార్, ఎస్.కె గౌస్, దాసరి సురేష్, ఏ శంకరన్న, వంగల శివరాం రెడ్డి, జలగం సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App