విద్యుత్ బిల్లులను తగలబెట్టిన అరకు వేలి (సిపిఎం) మండల కమిటీ.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.14 :
ఆదివాసి గిరిజన సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్దేవ్ మాట్లాడుతూ…
పేదలపై విపరీతమైన విద్యుత్ బారాలు, కస్టమర్ చార్జీలు , సర్దుబాటు చార్జీలు వంటి పేర్లతో సామాన్య గృహ వినియోగదారులపై రోజురోజుకీ మోయలేని విద్యుత్ బారాలు మోపుతూ బడా పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్య ప్రజలకు తీవ్రమైన భారంగా మారింది. అతి తక్కువ ఛార్జి తో సామాన్య ప్రజలకు రాష్ట్రంలో విద్యుత్ అందించవచ్చు కానీ అటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మంట కలుపుతూ అదాని కి సేవ చేయడం రాష్ట్రానికి రావణ కాష్టం గా మారుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు జి. బుజ్జిబాబు పి .బాలదేవ్ టి. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App