కూటమి ప్రభుత్వానికి గుర్తుకు రాని హామీలను గుర్తు చేసేందుకు పార్టీ శ్రేణులకు ఛలో పాడేరు, శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం (అరకు వేలి) మండలం : త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 13 :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు వ్యాలీ శ్రేణులకు ప్రజలకు తెలియజేయు ఏమనగా నేడు అనగా శుక్రవారం,సమయం 11:00AM గంటలకు పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతులకు జరుగుతున్న నష్టాన్ని సార్వత్రిక ఎన్నికల హామీలో భాగంగా గత వైసిపి ప్రభుత్వంలో రైతులకు పెట్టుబడి సహాయంగా అందించిన రైతు భరోసా ఏటా రూ. 20,000/- ఇస్తామన్న హామీ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, మరియు పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం మరియు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం కోసం ప్రభుత్వానికి తెలియజేయటానికి ర్యాలీ, విజ్ఞాపన పత్రం సమర్పణ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. కావున ఈ కార్యక్రమానికి అరకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, సర్పంచులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా, మండల, పంచాయితీ, గ్రామ స్థాయి ప్రతినిధులు, ప్రజలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App