సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.- అప్పలనరస పిలుపు..
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, అల్లూరిజిల్లా ఇంచార్జ్ : (పాడేరు ) భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు
పాడేరు మండల కమిటీ.
సి.పి.ఎం జిల్లా మహాసభల ను జయప్రదం చేయండి.
అధిక ధర తగ్గించాలని నవంబర్ 9 నుండి15 వరకు ప్రజా హోరు.
సి.పి ఎం పార్టీ జిల్లా కార్యదర్శి, పి. అప్పల నరస పిలుపు .
పాడేరు జిల్లా ప్రథమ మహాసభ ను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి, పి. అప్పల నరస పిలుపు నిచ్చారు. మోదపల్లి కమ్యూనిటీ హాల్ లో సి.పి.ఎం పార్టీ పాడేరు మండలం 7 వ మహాసభ ఘనంగా జరిగింది. మహాసభ ప్రారంభ సూచికగా పార్టీ సీనియర్ సభ్యులు కొండమ్మ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.
అనంతరం మహాసభ ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ జిల్లా కార్యదర్శి పి. అప్పల నరస మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ ప్రథమ మహాసభలను, డిసెంబరు 2 నుండి, 5 వరకు పాడేరు జిల్లా కేంద్రం లో జయప్రదం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వందలమంది ముఖ్యమైన నాయకులకు ప్రతినిధులుగా వస్తున్నారని తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధి, జి. ఓ నెంబరు 3 రిజర్వేషన్ సాధన, కాపీ రైతులు గిట్టుబాటు ధరలు ,కార్మికుల కూలీ రేట్లు ,పి.వి.టి.జి సమస్యలపై తీర్మానం చేసి భవిషత్ ఉద్యమ కార్యాచరణ కు ప్రణాళిక రూపొందించాలని, జిల్లా మహాసభ నిర్వహణ జరుగుతుంది.
నూతన గా ఏర్పడిన ప్రభుత్వం పరిపాలన గత ప్రభుత్వానికి భిన్నంగా లేదని ఇసుక ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటిందని, విద్యుత్ చార్జీలు భారం పెంచిందని అన్నారు.నూతన జిల్లా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయం నిర్మాణం పనులకు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టలేదని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
అధిక ధర తగ్గించాలని,నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రవేటు పరం చేయరాదని పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా హోరు పేరిట నవంబర్ 9 నుండి 15 వ తేదీ వరకు ప్రచార కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా పంచాయితీ, గ్రామ స్థాయి లో ముఖ్యమైన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App