TRINETHRAM NEWS

లిక్కర్‌ అక్రమాలపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ : ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం అక్రమాలపై దర్యాప్తు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులతో సిట్‌ వేయడం ఆసక్తి రేపుతోంది.

గత ప్రభుత్వంలో ఏపీలోని మద్యం విక్రయాల్లో వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. నగదు లావాదేవీలతో పాటు హోలో గ్రామ్‌ల వ్యవహారంలోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే.. లిక్కర్‌ అక్రమాలపై సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి. సీఐడీ డీజీ ద్వారా రిపోర్ట్‌ సమర్పించాలని ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఆదేశించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

liquor illegality