TRINETHRAM NEWS

కోట తహసీల్దార్ ఆధ్వర్యంలో మరోసారి జాతీయ జెండాకు అవమానం

ఆగస్టు 15,2021 తలక్రిందులుగా జెండా ఎగురవేసిన తహసీల్దార్ పద్మావతి.. తాజాగా ఈరోజు ముడి వీడకుండా అలాగే ఉన్న జెండాకు వందనం చేసిన పద్మావతి

తిరుపతి జిల్లా కోట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం 75 వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం నిర్వహణ

కోట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మువ్వన్నెల జెండాకు అవమానం

పతాకావిష్కరణ సమయంలో చిక్కు పడడంతో ఎగరని జాతీయ జెండా

పలుమార్లు కొంచెం కిందకు లాగి లాగి గుంజి గుంజి జెండాను ఎగురవేసే ప్రయత్నం

త్రివర్ణ పతాకం ఎగిరిందనుకుని పలుమార్లు సెల్యూట్ చేసిన తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, విద్యార్థులు

ఎంత ప్రయత్నించినా ముడి వీడకపోవడంతో రెప రెప లాడకుండా అలాగే ఉండిపోయిన త్రివర్ణ పతాకం

ఏం చేయాలో తెలియక అలాగే ఉంచి కార్యక్రమం కొనసాగించిన తహసీల్దార్ పద్మావతి

మెలిపడి ఎగరని జాతీయ జెండాకు వందనం చేసిన కోట తహసీల్దార్, రెవిన్యూ సిబ్బంది

ఎగరని జాతీయ జెండాకు తహసీల్దార్ వందనం చేయడం పట్ల కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, ఉద్యోగుల ఆశ్చర్యం

75 వ గణతంత్ర దినోత్సవం వేడుకగా కాదు.. తూతూ మంత్రంగానే..

ప్రతిజ్ఞ ఆలపించేందుకు జెండా దిమ్మె వద్దకు వచ్చిన విద్యార్థిని అవన్నీ ఎందుకులే అని అంటూ.. వెనక్కు పంపిన తహసీల్దార్, రెవిన్యూ సిబ్బంది

వందేమాతరం, జాతీయ గీతాలాపన లేదు.. ప్రైవేట్ వ్యక్తి రాసిన ఓ గీతాన్ని ఆలపించేందుకు ఆసక్తి కనబరచిన తహసీల్దార్

జెండా కర్రకు జాతీయ జెండా అలాగే వేలాడుతూ ఉన్నప్పటికీ కార్యక్రమం, ప్రసంగం కొనసాగించిన కోట తహసీల్దార్ పద్మావతి

గతంలో.. 2021 సం.. స్వాతంత్ర్యదినోత్సవం రోజున తలకిందులుగా జెండాను ఎగురవేసిన కోట తహసీల్దార్ పద్మావతి

తలకిందులుగా జెండాను ఎగురవేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో తీవ్రంగా పరిగణించిన అప్పటి గూడూరు ఆర్డీఓ

కోట మండల తహసీల్దార్ పద్మావతి, కార్యాలయం సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన గూడూరు ఆర్డీఓ మురళీ కృష్ణ

మళ్ళీ… తాజాగా గణతంత్ర దినోత్సవం రోజున చిక్కు పడి ఎగరని జెండాకు తహసీల్దార్ వందనం

విద్యార్థులకు చాక్లెట్లు పంచి, కార్యక్రమం అంతా పూర్తైన పిదప యధావిధిగా జెండా ఎగిరేలా సవరించిన రెవిన్యూ ఉద్యోగులు, సిబ్బంది

కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున, వీఆర్ఓలు రమణయ్య, వీఆర్ఏ, సచివాలయం సర్వేయర్లు

జెండా పండుగ సందర్భాల్లో.. కోట తహసీల్దార్ పద్మావతి నిర్లక్ష్యం, అనాసక్తి పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్న కోట మండల ప్రజలు

గతంలో జరిగిన అవమానంపై షో కాజ్ నోటీసులు.. ఈరోజు జాతీయ జెండాకు జరిగిన అవమానం రెండో తప్పిదం.. ఎలాంటి చర్యలుంటాయో వేచి చూడాలి మరి…!

భారత దేశంలోని ప్రతి ఒక్కరిలో భారతీయతను, జాతీయ సమగ్రతను స్వతంత్ర స్ఫూర్తిని చాటేందుకు దేశభక్తిని పెంపొందించేందుకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగ పేరిట వినూత్నంగా ఓ కార్యక్రమం అమలుపరచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. జెండా పండుగ నాడు ప్రతి ఇంటిపై మువ్వన్నెల పతాకం ఎగురవేసి సంచలనం సృష్టించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఆగస్టు 15, జనవరి 26 రోజులలో ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారు. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ రెండు దినోత్సవాలను కోట తహసీల్దార్ అవమానించారు.

తిరుపతి జిల్లా కోట మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆగస్టు 15, 2021 తేదీన జెండాను తలక్రిందులుగా ఎగురవేసి అవమానించారు. తలక్రిందులుగా జాతీయ జెండా ఎగిరిన దృశ్యాలు మీడియా, సోషల్ మీడియాలలో కథనాలుగా రావడంతో అప్పటి గూడూరు ఆర్డీఓ మురళీకృష్ణ సీరియస్ గా తీసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసారు. కార్యాలయం నుండి వివరణ కోరారు.

ఈ క్రమంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా కాకుండా తూ తూ మంత్రంగా చేసారు. మా తెలుగుతల్లి గీతాన్ని ఆలపించిన తర్వాత, ప్రతిజ్ఞ చేసేందుకు ఓ విద్యార్థి జెండా దిమ్మె వద్దకు రాగా అవన్నీ ఎందుకు లే అంటూ ఆ విద్యార్థిని వెనక్కు పంపించారు. పతాకావిష్కరణ చేస్తున్న సమయంలో జెండాకు, దారానికి చిక్కుముడి పడటంతో జెండా అలాగే వదులుకాకుండా ఉండిపోయింది. బలవంతంగా లాగినా కిందకి దించి పలుమార్లు అటు ఇటు కదిపినా మార్పు రాలేదు. ఈ స్థితిలో ఉన్న జెండాకు వందనం చేయడం సరికాదనే విషయం తెలిసినా కార్యక్రమం ముగించడమే తన ఉద్దేశ్యం అన్నట్టుగా అధికారులు జెండా అలాగే వేలాడుతున్నాగణతంత్ర దినోత్సవం ప్రాధాన్యతను తహసీల్దార్ వివరిస్తూ తన తన ప్రసంగాన్ని, కార్యక్రమాన్ని కొనసాగించారు.

జెండాను పలుమార్లు కొంచెం కిందకు లాగి లాగి గుంజి గుంజి జెండాను ఎగురవేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. త్రివర్ణ పతాకం కింద నుండి పైకి వెళ్లిన ప్రతిసారి ఎగిరిందేమో అనుకుని తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, విద్యార్థులు, హాజరైన వారు పలుమార్లు జెండాకు సెల్యూట్ చేసారు. జెండా ఎగురకపోవడంతో తీవ్ర నిరాశకు అసహనానికి గురయ్యారు. ఎంత ప్రయత్నించినా ముడి వీడకపోవడంతో త్రివర్ణ పతాకం రెప రెప లాడకుండా అలాగే ఉండిపోయింది. ఏం చేయాలో తెలియక అలాగే ఉంచి కార్యక్రమం అనంతరం తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది జెండాను సరి చేసారు.

ఆగస్టు 15 తేది జరిగిన తప్పిదాన్ని పునరావృతం చేయకుండా ఉండేందుకు ఎటువంటి రిహార్సల్స్ చేయకుండా ఈ జనవరి 26 నిర్వహించడంతో ఇలాంటి సంఘటన ఎదురైంది. మొత్తంమీద రెండూ పండుగల్లో జరిగిన అవమానాల్లోనూ తహసీల్దార్ గా పద్మావతి ఉండడమే గమనార్హం. తహసీల్దార్ వ్యవహారశైలిపై కోట మండల ప్రజలు మండిపడుతున్నారు.. గతంలో జాతీయ జెండాకు జరిగిన అవమానంపై అప్పటి గూడూరు ఆర్డీఓ మురళీకృష్ణ తీవ్రంగా పరిగణించగా, తాజాగా జరిగిన ఈ సంఘటనపై ప్రస్తుత గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఎలా స్పందిస్తారో.. వేచి చూడాలి..!